హీరోయిన్ దివ్యభారతి తల్లి మృతి


heroine divya bharati mother meeta bharati passes awayదివంగత హీరోయిన్ దివ్యభారతి తల్లి మీటా భారతి కన్నుమూశారు . ఈ సంఘటన జరిగింది ఏప్రిల్ 20న కానీ ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . హీరోయిన్ గా దివ్యభారతి తెలుగునాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించింది దివ్యభారతి కానీ తెలుగులోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది . దాదాపుగా 90 వ దశకంలో స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ భామ . దివ్యభారతి గ్లామర్ తో అప్పటి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది .

అయితే 19 వ ఏటనే నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా తో సన్నిహితంగా ఉన్న సమయంలో అపార్ట్ మెంట్ నుండి కిందపడిపోయింది . అప్పట్లో దివ్యభారతి మరణం పై పలు అనుమానాలు నెలకొన్నాయి . నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా పై పలు ఆరోపణలు వచ్చాయి కూడా . దివ్యభారతి మరణంతో ఆమె తల్లి కుంగిపోయింది . గతకొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మీటా భారతి ఏప్రిల్ 20 న చనిపోయింది . ఈ విషయాన్నీ దివ్యభారతి సమీప బంధువు నటి కైనత్ అరోరా తెలిపింది .