ఆనంద్ దేవరకొండ సరసన హీరోయిన్ ఫిక్స్!

Heroine Fix opposite Anand Deverakonda
ఆనంద్ దేవరకొండ సరసన హీరోయిన్ ఫిక్స్!

‘దొరసాని’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న ద్వితీయ చిత్రంలో హీరోయిన్ కన్ఫర్మ్ అయిందని వార్తలు వస్తున్నాయి..! ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో నూతన దర్శకుడు వినోద్ దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించే చిత్రం సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. ఆనంద్ దేవరకొండ సరసన వర్ష బొలమ్మను హీరోయిన్ గా ఎంపిక చేసారని చిత్ర యూనిట్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వర్ష ‘చూసి చూడంగానే నచ్చేసావే’ చిత్రంలో శివ కందుకూరి సరసన నటిస్తోంది..!!