కార్తికేయ 2 హీరోయిన్ ఫిక్స్


Karthikeya 2
Karthikeya 2

2014 లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం కార్తికేయ . నిఖిల్ హీరోగా నటించిన ఆ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు . కాగా ఇన్నాళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో పడ్డారు నిఖిల్ అండ్ కో . ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం పెద్ద ఎత్తున సెర్చింగ్ చేసిన నిఖిల్ ఎట్టకేలకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంలో నటించిన ” శృతి శర్మ ” ని కార్తికేయ 2 కోసం ఎంపిక చేసారు .

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించగా శృతి శర్మ హీరోయిన్ గా నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది . దాంతో ఆ సినిమాలో నటించిన శృతి శర్మ ని కార్తికేయ 2 హీరోయిన్ గా ఫిక్స్ చేసారు . కార్తికేయ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది అలాగే ఈ సీక్వెల్ కూడా ఆసక్తికరంగా మలచడానికి ట్రై చేసాడట చందు మొండేటి .

ఈ దర్శకుడికి సవ్యసాచి పెద్ద దెబ్బ కొట్టింది దాంతో కార్తికేయ 2 పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . అయితే తెలుగులో సీక్వెల్ అంతగా విజయాలు సాధించిన దాఖలాలు అయితే లేవు , మరి ఇదేం అవుతుందో చూడాలి .