బ్రెజిల్ హీరొయిన్ కి ఫిదా అయిపోయిన రౌడీ స్టార్

బ్రెజిల్ హీరొయిన్ కి ఫిదా అయిపోయిన రౌడీ స్టార్
బ్రెజిల్ హీరొయిన్ కి ఫిదా అయిపోయిన రౌడీ స్టార్

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ సినిమా డిజాస్టర్ కావడం; మరొక వైపు తన తమ్ముడిని హీరోగా పరిచయం చేసిన దొరసాని సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం అసలు ఈ ఏడాది విజయ్ దేవరకొండ కి సినిమాల పరంగా కొంచెం ఇబ్బందికరంగా గడిచింది. కానీ ఇదే సమయంలో రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు విజయ్. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో కె.ఎ వల్లభ నిర్మాతగా “వరల్డ్ ఫేమస్ లవర్” అనే సినిమా లో నలుగురు హీరోయిన్స్ తో జత కట్టాడు విజయ్. ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ ఆల్రెడీ రిలీజ్ కాగా, ప్రస్తుతం ఆ సినిమాలో మరో హీరోయిన్ ఇజబెల్ల లేట్చి లుక్ కూడా రిలీజ్ చేసారు.

ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు చెర్రీ అని తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఈ నటి “ఈ వాలైంటైన్స్ డే కానుక నా ప్రేమికుడు, వర్ల్స్ ఫేమస్ లవర్ అయిన గౌతం” ని కలుద్దాం అని ట్వీట్ చెయ్యగా, విజయ్ అందుకు నా చెర్రీ అని సినిమాకు సంబంధించిన ఫోటోను షేర్ చేసారు. ఇజబెల్ల బ్రెజిల్ మోడల్ మరియు గతంలో ఆమీర్ ఖాన్ తలాష్ సినిమాతో ఇక్కడ పరిచయం అయ్యారు. అఖిల్ హీరోగా వచ్చిన Mr.మజ్నూ సినిమాతో టాలీవుడ్ ఎంత్ర్ర్ ఇచ్చారు. జనవరి 3వ తేదీన వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ చేయ్యనున్నట్లు యూనిట్ ప్రకటించింది.

Credit: Twitter