మంచు లక్ష్మీ కి గ్రీటింగ్స్ తెలిపిన జ్యోతిక


heroine jyothika best wishes to manchu lakshmiమంచు లక్ష్మి తాజాగా ” వైఫ్ ఆఫ్ రామ్ ” చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . విజయ్ యెలకంటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ , వివేక్ కూచిబొట్ల తో కలిసి మంచు ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రాన్ని . హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ , ట్రైలర్ లతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగాయి . ఇక ఈ చిత్రాన్ని ఈనెల 20 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు దాంతో మంచు లక్ష్మి కి శుభాకాంక్షలు తెలియజేస్తోంది హీరోయిన్ జ్యోతిక .

మంచు లక్ష్మి తాజాగా తమిళ చిత్రంలో నటిస్తోంది కాగా ఆ చిత్రంలో జ్యోతిక కూడా నటిస్తోంది ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కావడంతో ” వైఫ్ ఆఫ్ రామ్ ” విజయం సాధించాలని గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఓ వీడియో ని పోస్ట్ చేసింది జ్యోతిక . హీరో సూర్య కూడా మంచు లక్ష్మి ప్రతిభాశాలి అంటూ పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు . హీరో సూర్య , జ్యోతిక లంటే మంచు లక్ష్మి కి ప్రత్యేకమైన అభిమానం పైగా వాళ్ళ నటన అంటే మహా ఇష్టం కూడా .

నటిగా , గాయకురాలిగా , నిర్మాతగా విభిన్న పార్శ్వాలను స్పృశించిన మంచు లక్ష్మి విభిన్న కథా చిత్రాలతో తన ప్రత్యేకత ని నిరూపించుకునే ఉంటోంది ఇక సాలిడ్ హిట్ కోసం వైఫ్ ఆఫ్ రామ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది .

English Title: heroine jyothika best wishes to manchu lakshmi