రహస్య వివాహం చేసుకున్న హీరోయిన్


heroine madalasa sharma got secret marriedఅల్లరి నరేష్ సరసన ఫిట్టింగ్ మాస్టర్ చిత్రంలో నటించిన ” మదాలస శర్మ ” రహస్య వివాహం చేసుకుంది . ఇంతకీ ఈ భామ చేసుకున్నది ఎవరినో తెలుసా ……. రేప్ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన ” మహాక్షయ్ ” ని . బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి తనయుడే ఈ మహాక్షయ్ . ఇతగాడి పెళ్లి ఇటీవల శనివారం రోజున జరగాల్సి ఉండే అయితే నాతో సహజీవనం చేసి , నన్ను మానసికంగా , శారీరకంగా వాడుకొని ఇప్పుడేమో మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని కోర్టు ని ఆశ్రయించడంతో పోలీసుల సహాయంతో ఆ పెళ్లి ఆపేసింది ఆ యువతి .

అయితే మహాక్షయ్ ని కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే బెయిల్ పై విడుదల చేసారు . స్టేషన్ నుండి రావడమే ఆలస్యం హీరోయిన్ మదాలస శర్మ ని రహస్యంగా వివాహం చేసుకున్నాడు ఊటీ లోని సొంత హోటల్ లో . కాబోయే భర్త పై అత్యాచార ఆరోపణలు ఉన్నప్పటికీ , పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ మహాక్షయ్ ని పెళ్లి చేసుకుంది .

మదాలస శర్మ తెలుగులో ఫిట్టింగ్ మాస్టర్ , ఆలస్యం అమృతం విషం చిత్రాల్లో నటించింది అయితే ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ కావడంతో ఈ భామకు తెలుగులో మళ్ళీ అవకాశాలు రాలేదు . కట్ చేస్తే ఇప్పుడు మిథున్ చక్రవర్తి కి కోడలయ్యింది మదాలస శర్మ .