పవన్ కు మద్దతుగా మాధవీలత మౌన దీక్ష


heroine madhavilatha support to pawan kalyan పవన్ కళ్యాణ్ ని నిన్న శ్రీ రెడ్డి బూతులు తిట్టడంతో దానికి వ్యతిరేకంగా హీరోయిన్ మాధవీలత ఈరోజు మౌన దీక్ష కు దిగుతోంది . ఈరోజు ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ముందు పదిగంటల కు మౌన దీక్ష చేపట్టనుంది . పది గంటల నుండి 12 గంటల వరకు మాధవీలత మౌనదీక్ష చేయనుంది . పవన్ కళ్యాణ్ అంటే మాధవీలత కు చాలా ఇష్టం , తన అభిమాన హీరో ని శ్రీ రెడ్డి దారుణంగా కామెంట్ చేయడంతో షాక్ అయి శ్రీ రెడ్డి కి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుంది .

అసలు కాస్టింగ్ కౌచ్ గురించి గత ఏడాది గా మాధవీలత చెబుతూనే ఉంది . అదే సమయంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తరుపున పనిచేస్తానని ముందుకు వచ్చింది కూడా . ఎన్నికలు మరో ఏడాది సమయం ఉన్న ఈ సమయంలో పవన్ పై పలు ఆరోపణలు వస్తుండటంతో అభిమానులను కలవరానికి గురి చేస్తోంది . ఇక మాధవీలత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా దీక్ష కు దిగడంతో ఆమెకు మద్దతు ఇస్తున్నారు పవన్ ఫ్యాన్స్ .