కాబోయే భర్త ఇతడే అని కన్ఫర్మ్ చేసిన నయనతార


heroine nayanatara announced vignesh shivan fianceతనకు కాబోయే భర్త దర్శకులు విగ్నేష్ శివన్ అని చెన్నై లో జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేసింది అగ్రశ్రేణి కథానాయిక నయనతార . దర్శకత్వ శాఖలో పనిచేసిన విగ్నేష్ నయనతార తో ఒక సినిమా చేసాడు అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలో నయనతార కు దగ్గరయ్యాడు దాంతో అతడితో స్నేహాన్ని కొనసాగించింది కట్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తుండటంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి అంతేకాదు ఇద్దరూ కేరళలో రహస్య వివాహం కూడా చేసుకున్నారు అని వార్తలు వచ్చాయి .

కట్ చేస్తే …… పెళ్లి కాలేదని కానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని మాత్రం నయనతార స్పష్టం చేసింది . దక్షిణాదిన టాప్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార ఇంతకుముందు శింబు , ప్రభుదేవా లతో ప్రేమాయణం సాగించింది కానీ విగ్నేష్ తో ఆమె బంధం ముడిపడుతోంది .