హౌస్ ఫుల్ ఎఫెక్ట్.. పూజకి మరో అఫర్ 


Heroine pooja hegde getting more offers
Heroine pooja hegde getting more offers

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో అఫర్ అందుకున్న అమ్మడి కెరీర్ కి మరో రెండేళ్ల వరకు డోకా లేదనిపిస్తోంది. ఇక బాలీవుడ్ వైపు కూడా ఈ బ్యూటీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇటీవల విడుదలైన హౌజ్ ఫుల్ 4 డిజాస్టర్ అనే టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా కలెక్షన్స్ గట్టిగా రావడంతో పూజా ఫుల్ హ్యాపీ అయ్యింది.

ఇక సినిమా ఎఫెక్ట్ తో ఇప్పుడు బాలీవుడ్ లో బేబీకి మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పూజ మాత్రం తొండరపడకుండా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటోంది. మొత్తానికి F2 రీమేక్ లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అత్యధిక లాభాల్ని అందించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన F2 సినిమాను బోణి కపూర్ తో కలిసి బాలీవుడ్ లో రీమేక్ చేయాలనీ దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక సినిమాలో ఒక పాత్ర కోసం పూజ హెగ్డేని ఫిక్స్  చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో తమన్నా – మెహ్రీన్ కథానాయికలుగా నటించగా ఇప్పుడు మెహ్రీన్ చేసిన హాని పాత్రకు పూజను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లో స్టార్ హీరోలని ఫైనల్ చేయాలని బోణి కపూర్ ఆలోచిస్తున్నారట. త్వరలోనే ఈ క్రేజీ రీమేక్ పై స్పెషల్ ఎనౌన్న్మెంట్ వెలువడనుంది.