ప్రణీత రెండేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటుందట


heroine pranitha react about her marriage అత్తారింటికి దారేది చిత్రంలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన భామ ప్రణీత . ఆ సినిమా తర్వాత బాపు బొమ్మ గా మారిపోయింది . అయితే హీరోయిన్ గా పరిచయమై దాదాపు 8 ఏళ్ళు గడుస్తున్నా బ్రేక్ మాత్రం రాలేదు . పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో కెరీర్ వేగం అందుకోలేకపోయింది దాంతో హోటల్ బిజినెస్ పై దృష్టి పెట్టింది ఈ భామ .

 

తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఈ భామ మీడియా ముందుకు వచ్చి రెండేళ్ల తర్వాతే నా పెళ్లి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చింది . రకరకాల సినిమాలు వస్తున్నాయని కానీ కథ నచ్చితేనే ఓకే చెబుతున్నానని అంటోంది . కన్నడ భామ అయిన ప్రణీత పలు భాషలలో నటించినప్పటికీ ఎక్కడ కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అందుకోలేక పోయింది పాపం .