రకుల్ కు ఎలాంటి మగాడు కావాలో తెలుసా


heroine rakul preet singh talk about her partnerనా హైట్ 5. 9 కాబట్టి నాకంటే హైట్ ఉన్న మగాడు అంటే ఆరడుగులు ఉన్నవాడు కావాలని అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటానని మరోసారి ప్రకటించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ . ఇంతకుముందు కూడా నాకు ఆరడుగుల మగాడు కావాలని ప్రకటించి సంచలనం సృష్టించిన రకుల్ తాజాగా మరోసారి అలాంటి ప్రకటనే ఇచ్చి మరోసారి ఆశ్చర్యానికి గురి చేసింది .

 

తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తూ అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన ఈ భామ కు ప్రస్తుతం తెలుగులో పెద్దగా చిత్రాలు లేవు దాంతో బాలీవుడ్ లో జెండా పాతాలని వెళ్ళింది . తెలుగులో అగ్ర హీరోలతో నటించిన ఈ భామ మనసు ప్రస్తుతం బాలీవుడ్ హీరోలపై పడింది . అయితే ఈ భామ పెళ్లి చేసుకునే వాడు తనకంటే హైట్ ఎక్కువగా ఉండాలని పదేపదే కోరుతోంది అంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుందేమో అని అనుమానాలు వస్తున్నాయి .