రష్మిక మందన్న కు గుడి కట్టించాలట !


Rashmika Mandanna
Rashmika Mandanna

కుష్బూ కు తమిళనాట గుడి కట్టించారు అలాగే నాకు కూడా అభిమానులు గుడి కట్టిస్తే బాగుండు అని అత్యాశ పడుతోంది రష్మిక మందన్న . కన్నడ భామ అయిన రష్మిక మందన్న కు తెలుగులో అలాగే ఇపుడు తమిళంలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి . ఏకంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తుండటంతో నిజంగానే పెద్ద స్టార్ అయిపోయినట్లు ఫీల్ అవుతోంది దాంతో కుష్బూ కి గుడి కట్టించినట్లు నాకు కూడా గుడి కడితే బాగుండు అని ఆశపడుతోంది పాపం .

కుష్బూ అంటే 80 – 90 వ దశకంలో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది . కుష్బూ అందాలకు అప్పటి కుర్రాళ్ళు ఫిదా అయ్యారు అందుకే గుడి కట్టించారు . రష్మిక మందన్న కు ఇంకా అంతటి ఫాలోయింగ్ రాలేదు యువతలో అంతగా క్రేజ్ కూడా లేదు మరి . ఇక గుడి ఎలా సాధ్యం అవుతుంది . అయినా …… ఏమో ! గుర్రం ఎగరా వచ్చు .