కాస్టింగ్ కౌచ్ :రెజీనా ని కూడా వేధించారట


heroine regina cassandra sensational comments on casting couchసినిమారంగంలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమే అని నాపై కొంతమంది లైంగిక దాడులు చేయాలనీ ప్రయత్నించారని , అంతెందుకు ఈమధ్య ఓ పబ్లిక్ ఫంక్షన్ లో సైతం ఓ ఆకతాయి నన్ను తాకరాని చోట తాకి ఇబ్బంది పెట్టాడని సంచలన వ్యాఖ్యలు చేసింది బ్లాక్ బ్యూటీ రెజీనా కాసాండ్రా . గతకొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమని కాస్టింగ్ కౌచ్ ఇష్యు ఇబ్బంది పెడుతోంది . శ్రీరెడ్డి వ్యవహారంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ లో గందర గోళం నెలకొంది . గత నెలరోజులుగా అగ్ర హీరోలకు , దర్శక నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం .

తెలుగులో అలాగే తమిళ చిత్రాల్లో పలు చిత్రాల్లో నటించింది రెజీనా కాసాండ్రా . నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఆకట్టుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ పాపం అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు . పైగా ఇప్పుడు ఈ భామ చేతిలో ఒక్క తమిళ సినిమా తప్ప మరో సినిమా ఏది లేదు రెజీనా చేతిలో . ఈ భామ ని కొంతమంది తమ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నించారట ! అయితే నేను మాత్రం ఎవరికీ లొంగలేదని అంటోంది . ఈ సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయిందని అంటోంది రెజీనా .