హీరోయిన్ వీడియో వైరల్ అవుతోంది


హీరోయిన్ శాన్వీ శ్రీవాత్సవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . శాన్వీ వీడియో అనగానే అదేదో బూతు వీడియో అనుకుంటారేమో ! కాదు కాదు ……. శాన్వీ ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియో హల్చల్ చేస్తోంది ఎందుకంటే రకరకాల కసరత్తులు చేస్తూ చాలా కష్టపడుతోంది పాపం . ఇంతగా ఎందుకు కష్టపడుతుందో తెలుసా ….. ఫిట్ నెస్ కోసం . తెలుగులో లవ్లీ , రౌడీ , అడ్డా , ప్యార్ మే పడిపోయానే తదితర చిత్రాల్లో నటించింది ఈ భామ . ఈ భామ నటించిన చిత్రాల్లో లవ్లీ మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది .

మిగతా సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి . దాంతో కన్నడ బాట పట్టింది అయితే అక్కడ మాత్రం సక్సెస్ అయ్యింది . కన్నడంలో పలు చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ . ఇంకా ఛాన్స్ లు వస్తున్నాయి కాబట్టి మరింత ఫిట్ గా ఉండటానికి ఇంతగా కష్టపడుతోంది పాపం శాన్వి శ్రీవాత్సవ .