త‌న‌ని తానే తిట్టుకుంటున్న శృతిహాస‌న్!


త‌న‌ని తానే తిట్టుకుంటున్న శృతిహాస‌న్!
త‌న‌ని తానే తిట్టుకుంటున్న శృతిహాస‌న్!

క్రేజీ క‌థానాయిక శృతీహాస‌న్ త‌న‌ని తానే తిట్టుకుంటోంది. `గ‌బ్బ‌ర్‌సింగ్‌` సినిమాతో తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న శృతీహాస‌న్ ఆ త‌రువాత బ‌లుపు, శ్రీ‌మంతుడు వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల్నీ ద‌క్కించుకుంది. అయితే `కాట‌‌మ రాయుడు` త‌రువాత మాత్రం తెలుగులో క‌నిపించ‌కుండా పోయింది. మ‌ళ్లీ తెలుగులో పాగా వేయాల‌ని ర‌వితేజ న‌టిస్తున్న `క్రాక్‌` సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది.

ఇదిలా వుంటే క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ఇంటి ప‌ట్టునే వుంటున్న శృతిహాస‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ట‌చ్‌లో వుంటోంది. తాజాగా శృతి పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్‌ని విస్మ‌యానికి గురిచేసింది. త‌న‌ని తానే తిట్టుకోవ‌డం నెటిజ‌న్స్‌కి అర్థం కాలేదు. `నేను ఈ రోజు జిమ్‌లో ఒక గంట వ‌ర్క‌వుట్ చేయ‌డం త‌ప్ప ఇంకేమీ చేయ‌లేదు. నేనొక ప‌నికి రాని మ‌హిళ‌ని` అని పోస్ట్ చేసింది.

శృతిహాస‌న్ గ‌త ఏడాది క్రితం త‌న బాయ్ ఫ్రెండ్ మైఖేల్ క్రోస‌ల్‌కు బ్రేక‌ప్ చెప్పేసి మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టింది. తెలుగులో శృతి న‌టిస్తున్న చిత్రం `క్రాక్‌` అంతా అనుకున్న ప్ర‌కారం పూర్త‌యితే ఈ చిత్రాన్ని మే 8న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. క‌రోనా కార‌ణంగా ఆ ప్లాన్ మారింది. లాక్‌డౌన్ త‌రువాత ప‌రిస్థితులని బ‌ట్టి బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని పూర్తి చేసి చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు.