రెమ్‌డెసివ‌ర్ కావాలా ఇలా న‌మోదు చేసుకోండి!


రెమ్‌డెసివ‌ర్ కావాలా ఇలా న‌మోదు చేసుకోండి!
రెమ్‌డెసివ‌ర్ కావాలా ఇలా న‌మోదు చేసుకోండి!

దేశంలో నానాటికీ క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్ర‌మాద స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి. కేసుల‌తో పాటు మ‌ర‌ణాల రేటు కూడా భారీగానే పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు ఫార్మా కంప‌నీలు వ్యాక్సిన్ కోసం ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే మ‌న దేశానికి చెందిన రెండు కంపెనీలు ఇప్ప‌టికే వ్యాక్సిన్‌ని త‌యారు చేశామంటున్నాయి.

క‌రోనా తీవ్ర‌త అధికంగా వున్న వారికి రెమ్ డెసివ‌ర్ ని వాడ‌మ‌ని డాక్ట‌ర్లు ప్ర‌తిపాదిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ని హెటిరో సంస్థ సిద్ధం చేసింది. ప్ర‌స్తుతం ఈ డ్ర‌గ్‌ని హైరిస్క్ వున్న పేషెంట్‌ల‌కు మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. దీంతో ఈ డ్ర‌గ్ కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఈ ఇంజ‌క్ష‌న్ కోసం భారీ స్థాయిలో బ్లాక్ మార్కెట్ న‌డుస్తోంది.

5 వేల‌కు ల‌భించే ఈ వ్యాక్సిన్‌ని బ్లాక్‌లో 30 వేల‌కు విక్ర‌యిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ వ్యాక్సిన్ త‌యారీ సంస్థ హెటీరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెమీడెసివ‌ర్ మందు కావాల్సిన వారు డైరెక్ట్‌గా హెటిరో సైట్‌లోని ప్రొడ‌క్ట్ ఎంక్వైరీ పేజీలో త‌మ పేరు, ఈ మెయిల్‌, లొకేష‌న్‌, ఎన్ని బాటిల్స్ కావాలో ఆ వివ‌రాల‌తో పాటు కాంటాక్ట్ వివ‌రాల‌ని న‌మోదు చేయాల‌ని వెల్ల‌డించింది. ఆ వివ‌రాల ప్ర‌కారం తామే నేరుగా వ్యాక్సిన్ బాటిల్స్‌ని అంద‌జేస్తామ‌ని హెటీరో సంస్థ ప్ర‌క‌టించింది.