సిత్తరాల సిరపడు పాటకు శ్రీ కృష్ణుడుకి ఉన్న సంబంధంసిత్తరాల సిరపడు పాటకు శ్రీ కృష్ణుడుకి ఉన్న సంబంధం
సిత్తరాల సిరపడు పాటకు శ్రీ కృష్ణుడుకి ఉన్న సంబంధం

ఇప్పుడు అల వైకుంఠపురం సినిమాలో సర్ ప్రైజ్ గా దాచిపెట్టి రిలీజ్ చేసిన “సిత్తరాల సిరపడు” అనే పాటను అందరూ ఎందుకు ఈ పాటను అంతగా ఇష్టపడుతున్నారు.? పాడుకుంటున్నారు.? ఈ పాటలో మనకు కనిపించే అర్థం కన్నా కనిపించని అంతరార్థం చాలా ఉంది. భగవంతుడైన శ్రీ కృష్ణుడు లీలలు ఈ పాటలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆయన చిన్నతనంలో ఆయన యశోద దగ్గర పెరిగేటప్పుడు కంసుడు పంపించిన ఎంతో మంది రాక్షసులు మాయ వేషంలో వచ్చి ఆయనను చంపాలని చూసినప్పుడు ఆయన వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు.? అనేది పోతన గారు రాసిన భాగవతం లో ఉంటుంది. అదేవిధంగా నన్నయ తిక్కన ఎర్రన రాసిన ఆంధ్ర మహాభారతంలో కూడా ఉంటుంది. కానీ సంస్కృతంతో పాటు ఆ స్థాయి తెలుగు సాహిత్యం చదవని మామూలు మట్టి మనుషులు భగవంతుడైన శ్రీ కృష్ణుడు గురించి తమదైన యాసలో వాడుకుని ఎన్నో పాటలు ప్రస్తుతం కనుమరుగైపోతున్నాయి అలాంటి పాటే సిత్రాలు సిరపడు. అసలు ఈ పాటలో శ్రీకృష్ణుడి రిఫరెన్స్ ఎలా ఉంది.? అనే విషయం ఈ పాటలో సాహిత్యాన్ని గమనిస్తే తెలుస్తుంది.

పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు

జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొమ్పంటే..
దయ్యముతొ కయ్యానికి తొడగొట్టి దిగాడు

పది మంది నాగలేని పది మూరల సోరసేప
ఒడుపుగా ఒంటి సేత్తోఒడ్డుకోట్టుకోచినాడు

వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే
ఈ ఈడీదుకుంటుబోయి ఈడ్చుకొచ్చినాడురో

శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించడం; తన స్నేహితులతో కలిసి చిన్న చిన్న గొడవలు చేయటం; అదేవిధంగా గోపికలతో ఆయన చేసే చిలిపి చేష్టలు, ఆ సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలను ఆయన సమర్థవంతంగా పరిష్కరించిన తీరు
ఈ పాటలో అంతర్లీనంగా మనం గమనించవచ్చు. ఒక వేళ మీకు ఈ విషయం నచ్చినా నచ్చకపోయినా మరొకసారి “సిత్తరాల సిరపడు” పాటను వినండి, ఆలోచించండి. ఎందుకంటే పాటలంటే పాడుకునేవి మాత్రమే కాదు.. మన జీవితంలో ఎన్నో
సందర్భాల్లో వాడుకునేవి. మనం కష్టం వచ్చినప్పుడు మనల్నిఆదుకునేవి. ఇలాంటి మరెన్నోగొప్ప పాటల గురించి మళ్లీ మాట్లాడుకుందాం.