ప్ర‌భాస్ ఫామ్ హౌస్ ఇంకా వివాదంలోనే…!


ప్ర‌భాస్ ఫామ్ హౌస్ ఇంకా వివాదంలోనే...!
ప్ర‌భాస్ ఫామ్ హౌస్ ఇంకా వివాదంలోనే…!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఫామ్ హౌస్ పై వివాదం ఇంకా వీడ‌లేదు. హైద‌రాబాద్ రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం రాయ‌దుర్గంలోని 2083 చ‌ద‌ర‌పు గ‌జాల స్థలం వివాదంలో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది కోర్టు దాకా వెళ్లడంతో  ఈ స్థ‌లంపై రాష్ట్ర హైకోర్టు తాజాగా తీర్పుని వెలువ‌రించింది. దీనిపై య‌దాత‌ద స్థితిని కొన‌సాగించాల‌ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వంతో పాటు హీరో ప్ర‌భాస్‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

వివాదం తేలే వ‌ర‌కు స్థ‌లాన్ని ప్ర‌భాస్‌కు స్వాధీనం చేయ‌రాద‌ని, అలాగ‌ని అక్క‌డ వున్న ఫామ్ హౌస్‌ని కూల్చ‌రాద‌ని తీర్పునిచ్చింది. ఈ స్థ‌ల వివాదంపై ప్ర‌భాస్ పెట్టిన పిటీష‌న్ పై క్రింది కోర్టు ఇచ్చిన ఇంజ‌క్ష‌న్‌ని ఎత్తివేయాలంటూ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన ద‌ర‌ఖాస్తును వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని హైకోర్టు కింది కోర్టుని ఆదేశించింది.

ఈ మేర‌కు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆర్. ఎస్‌. చౌహాన్, జ‌స్టీస్ పి. న‌వీన్‌రావుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం   తాజా ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాయ‌దుర్గం స‌ర్వే నంబ‌రు 5/3 లోని 2083 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ ప్ర‌భాస్ కూక‌ట్‌ప‌ల్లి 15వ అద‌ర‌పు జ‌డ్జి వ‌ద్ద ప్ర‌భాస్ పిటీష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం కౌంట‌ర్ పిటీష‌న్‌ని దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.