రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయించి తప్పు చేసిన కేసీఆర్


High court serious on Revnath reddy issue

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయించి కేసీఆర్ పెద్ద తప్పు చేసినట్లు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు . రేవంత్ రెడ్డి ని తెల్లవారు ఝామున అరెస్ట్ చేయడం అందునా బెడ్ రూం తలుపులు బద్దలు కొట్టి మరీ రేవంత్ ని లాక్కుంటూ తీసుకెళ్లడంతో పెద్ద ఎత్తున ప్రజల నుండి వ్యతిరేకత ఎదురయ్యింది . ప్రజల నుండి కాంగ్రెస్ శ్రేణుల నుండి అలాగే వివిధ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో స్పందించిన ఎలెక్షన్ కమీషన్ రేవంత్ రెడ్డి ని విడుదల చేయాలనీ డిజిపి ని ఆదేశించడంతో అలాగే హై కోర్టు కూడా రేవంత్ అరెస్ట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగొచ్చిన పోలీసులు ఎట్టకేలకు రేవంత్ ని విడుదల చేసారు .

రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి తమ బలాన్ని , అధికారాన్ని చూపించాలని అనుకున్నారు కానీ అది రివర్స్ అయి రేవంత్ రెడ్డి కి ప్లస్ అయ్యింది . రేవంత్ పట్ల ప్రజల్లో సానుభూతి పెద్ద ఎత్తున రావడంతో కేసీఆర్ అండ్ కో ఖంగుతిన్నారు . రేవంత్ ని భయపెట్టాలని చూస్తే తిరిగి కేసీఆర్ ఇమేజ్ పలుచన అయ్యింది . రేవంత్ వ్యవహారం మొత్తం దేశానికి పాకింది దాంతో రేవంత్ కు మరింతగా ఇమేజ్ పెరిగింది …… కేసీఆర్ కు నష్టం చేసింది . మొత్తానికి రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయించి కేసీఆర్ పెద్ద తప్పు చేసాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .

English Title: High court serious on Revnath reddy issue

High court serious on Revnath reddy issue