సరిలేరు నీకెవ్వరులో హైలైట్ పాయింట్ అదే అంటున్నారే!


Highlight episode in Sarileru Neekevvaru revealed
Highlight episode in Sarileru Neekevvaru revealed

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల కానున్న విషయం తెల్సిందే. అల వైకుంఠపురములో నుండి డైరెక్ట్ పోటీ ఉన్న కారణంగా సరిలేరు నిర్మాతలు ప్రమోషన్స్ ను మరో లెవెల్ లో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, నాలుగు పాటలు విడుదల కాగా అన్నిటికీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో కమర్షియల్ అంశాలకు పెద్ద పీట వేసిన సంగతి అర్ధమవుతోంది. అలాగే కామెడీ కూడా హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.

అనిల్ రావిపూడి గత నాలుగు సినిమాలు గమనిస్తే కామెడీనే మెయిన్ హైలైట్. రొటీనే అయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఎక్కడా తగ్గడు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా కామెడీని మెయిన్ హైలైట్ గా ప్రోజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం కేవలం కామెడీనే కాకుండా ఈ సినిమాలో మరో హైలైట్ అంశం కూడా ఉందట. అదే సెంటిమెంట్. ఇందులో ఉండే ఫ్యామిలీ సెంటిమెంట్, ఆ వర్గం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా విజయశాంతి-రాజేంద్ర ప్రసాద్-మహేష్ బాబు త్రెడ్ బాగా వర్కౌట్ అవుతుందని, ఫ్యామిలీ ప్రేక్షకులను ఈ ఎపిసోడ్ బాగా అలరిస్తుందని అంటున్నారు.

అనిల్ రావిపూడి సినిమాల్లో కామన్ కనిపించే ఫ్యాక్టర్.. ఫస్ట్ హాఫ్ వరకూ పైసా వసూల్ లా నడిపించే అనిల్, సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం చేతులెత్తేస్తుంటాడు. కానీ అతని సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. అందుకే ఈసారి ఇందులో ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దడానికి కష్టపడుతున్నాడు అనిల్ రావిపూడి.

మహేష్ ఇందులో ఆర్మీ మేజర్ లో కనిపించనున్న సంగతి తెల్సిందే. అలాగే ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి 13 ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ హైలైట్స్ అన్నీ వర్కవుటై సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.