వాల్మీకిలో ‘ఆ ఎపిసోడ్’ హైలైట్ అట


valmiki
valmiki

తమిళ్ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది వాల్మీకి. హరీష్ శంకర్ ఈ చిత్రానికి తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసాడట.

ఈ చిత్రంలో విలన్ పాత్ర అత్యంత కీలకం. ఆ పాత్ర మాతృకలో చేసిన బాబీ సింహాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. హరీష్ శంకర్ ఈ పాత్రకు కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి ఒక లవ్ స్టోరీని కూడా సెట్ చేసాడట.

అయితే ఈ లవ్ స్టోరీ పూర్తి ఎంటర్టైనింగ్ గా ఉండడమే కాకుండా సరికొత్తగా ఉంటుందని హరీష్ శంకర్ తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పీరియాడిక్ సెటప్ లో వరుణ్, పూజ హెగ్డే మధ్య వచ్చే ఈ ప్రేమ కథ సినిమాకి హైలైట్ గా ఉంటుందని, జిగర్తాండ చూసిన వాళ్లకు కూడా ఈ ఎపిసోడ్ సరికొత్త ఫీల్ ని ఇస్తుందని అంటున్నాడు.

సెప్టెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. మరి హరీష్ శంకర్ చూపించేది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది కొన్నాళ్ళు ఆగితే తెలిసిపోతుంది.