బిగ్ బాస్ ను హిమజ బాగా వాడుకుంటోందిగా


Himaja using Bigg Boss 3 fame
Himaja using Bigg Boss 3 fame

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వల్ల పార్టిసిపంట్స్ కు మంచి ఫేమ్ వస్తుంది. దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే కెరీర్ పరంగా మంచి స్థాయికి వెళ్లొచ్చు. తెలుగు వరకూ చూసుకుంటే మొదటి సీజన్ లో హరిప్రియ, రెండో సీజన్ లో కౌశల్ బిగ్ బాస్ ను బాగా వాడుకున్నారు. ఇక మూడో సీజన్ లో అవకాశాన్ని ఎవరు సరిగ్గా వినియోగించుకుంటారు అన్న సందేహం చాలామందిలో నెలకొంది.

అయితే బిగ్ బాస్ 3 ఇంకా ఎవరు గెలుస్తారు అన్న క్లారిటీ లేదు కానీ హిమజ మాత్రం బిగ్ బాస్ ఫేమ్ ను పూర్తిగా వాడుకుంటోంది. అసలు హౌజ్ లో నుండి బయటకి రావడమే అందరి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన హిమజ బిగ్ బాస్ ను, హోస్ట్ నాగార్జునను కూడా వదల్లేదు. బిగ్ బాస్ నే మ్యానేజ్ చేస్తోందని శ్రీముఖిని కామెంట్ చేసింది.

రీసెంట్ గా పునర్నవి ఎలిమినేట్ అయిపోతే డ్యాన్స్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఏ ఒక్కరినీ వదలకుండా అందరి మీద విమర్శలు చేయడంతో హిమజకు బాగానే పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు షాప్ ఓపెనింగ్ లకు హిమజను పిలుస్తున్నారు. అలాగే మళ్ళీ సినిమాల్లో నటించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. మరి అవి ఏ మేరకు సక్సెస్ అవుతాయో.