సైరా ట్రైలర్ తో హిందీ జనాలు ఖుషీ!


Sye Raa
సైరా ట్రైలర్ తో హిందీ జనాలు ఖుషీ!

ఇప్పటిదాకా సైరా నరసింహారెడ్డి సినిమాకు సరైన ప్రమోషన్స్ లభించట్లేదు అని బాధపడుతున్న మెగా అభిమానులకు ఒక్క ట్రైలర్ తోనే బెంగ తీరిపోయింది. ఈ ట్రైలర్ తో మెగా అభిమానుల్లో సరికొత్త జోష్ వచ్చింది. కచ్చితంగా ఇది ఒక భారీ ప్రయత్నంగా భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా దీన్ని బాలీవుడ్ వారు ఎలా స్వీకరిస్తారోనన్న సందేహాలు ఉన్నాయి.

అయితే సైరా హిందీ టీజర్, తెలుగుతో సమంగా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. రెండు వెర్షన్స్ లోనూ ట్రైలర్ 6 మిలియన్స్ దాటి వ్యూస్ సాధించింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు ట్రైలర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ట్రైలర్ అదిరిపోయిందని, సౌత్ సినిమాలు బాలీవుడ్ ను దాటేశాయని తెగ పొగిడేస్తున్నారు. అక్టోబర్ 2న వార్ సినిమా బాలీవుడ్ లో విడుదలవుతుండగా, అది సైరా ముందు ఏ మాత్రం నిలబడదని అంటున్నారు. ఈ కామెంట్స్ సంగతి బానే ఉంది కానీ నిజంగా ఈ ఊపు సినిమా రిలీజ్ టైంకి టిక్కెట్ల రూపంలో మారుతుందంటారా?