హిప్పీ కూడా బోల్డ్ సినిమానేనా !


ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన కార్తికేయ తాజాగా హిప్పీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో తెలుగు , తమిళ బాషలలో ఏకకాలంలో తెరకెక్కింది ఈ హిప్పీ చిత్రం . తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు ఆ చిత్ర బృందం . ఇక ఈ సినిమా కూడా ఆర్ ఎక్స్ 100 చిత్రం లాగే అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కినట్లు కనిపిస్తోంది .

విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయి , అలాగే బోల్డ్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంది . ఇద్దరు అందమైన ముద్దగుమ్మల మధ్య ఓ యువకుడి జీవితం అన్నట్లుగా సాగింది ట్రైలర్ . జూన్ 7 న ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ బాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రాన్ని తమిళ అగ్ర నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించడం విశేషం .