హిట్ టాక్ సొంతం చేసుకున్న మూడు చిత్రాలు


history made : three tollywood hits in on day

టాలీవుడ్ చరిత్రలో తిరుగులేని రోజుగా మారింది ఈరోజు ఎందుకంటే ఈరోజు ఆరు చిత్రాలు విడుదల కాగా మూడు చిత్రాల ఊసే లేదు ఇక మిగిలిన మూడు చిత్రాల్లో మూడుకి మూడు హిట్ టాక్ సొంతం చేసుకోవడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది . ఈరోజు రిలీజ్ అయిన వాటిలో బ్రాండ్ బాబు , చిలసౌ , గూఢచారి చిత్రాలు విజయాలు నమోదు చేయడంతో ఆ చిత్ర బృందాలు చాలా చాలా సంతోషంగా ఉన్నాయి . బుల్లితెర మెగాస్టార్ గా పేరుగాంచిన వ్యక్తి ప్రభాకర్ దర్శకత్వం వహించిన బ్రాండ్ బాబు చిత్రానికి కూడా హిట్ టాక్ వచ్చింది . ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది . ఈ చిత్రానికి దర్శకులు మారుతి కథ , కథనం అందించడం విశేషం .

అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ కూడా డీసెంట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది . రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నాగార్జున తో పాటు నాగచైతన్య , సమంత లు ఫుల్ సపోర్ట్ చేసారు . ఇక టాక్ కూడా ఈ సినిమాకు చాలా బాగుంది . యూత్ ని ఆకట్టుకునే చిత్రంగా . ఇక మూడో సినిమా విషయానికి వస్తే ……… గూఢచారి నేపథ్యంలో అప్పట్లో తెలుగులో సినిమాలు వచ్చేవి కానీ ఈతరానికి మాత్రం అంతగా తెలీదు దాంతో అడవి శేష్ ఆ ప్రయత్నం చేసి ప్రేక్షకులను అలరింప జేస్తున్నాడు .ఇలా ఈరోజు విడుదలైన మూడు సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారు . అయితే టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు సాధించే చిత్రాలు ఏవి అన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది .

English Title: history made : three tollywood hits in on day