హిట్ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

హిట్ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
హిట్ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

న్యాచురల్ స్టార్ నాని అ! సినిమా తర్వాత మరోసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం హిట్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు పాత్రలో నటించాడు విశ్వక్ సేన్. వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల్లో నటించిన విశ్వక్ సేన్ కు ఫలక్ నూమా దాస్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయమే సాధించినా విశ్వక్ కు మాత్రం బాగా ప్లస్ అయింది.

దాంతో హిట్ చిత్రానికి బజ్ బాగానే వచ్చింది. సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్, స్నిక్ పీక్ లతో హిట్ చిత్రంపై అందరిలోనూ పాజిటివ్ ఇంప్రెషన్ కలిగింది. ఇక సినిమా కూడా అంచనాలకు తగ్గట్లే ఉండడంతో మొదటి రోజు వసూళ్లు బాగున్నాయి. తొలి వీకెండ్ మొత్తం ఇదే ట్రెండ్ కంటిన్యూ అయింది. మూడో రోజు అయిన ఆదివారం మొదటి రోజు కంటే వసూళ్లు ఎక్కువ నమోదవ్వడం విశేషం.

ఇక తొలి వీకెండ్ లో 3.57 కోట్ల షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఈ చిత్రం వీక్ డే అయిన సోమవారం నాడు డ్రాప్ చూపించింది. సాధారణంగా ఏ చిత్రానికైనా సోమవారం నాడు డ్రాప్స్ ఉంటాయి. హిట్ కూడా 50 శాతం మేర డ్రాపయింది. అయినా కానీ నాలుగో రోజు 45 లక్షల డీసెంట్ షేర్ ను సాధించింది. మొత్తంగా నాలుగు రోజులకు ఈ చిత్రం 4 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం విశేషం. తొలి వారం పూర్తయ్యేలోపు ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి వెళ్లనుంది.

హిట్ 4 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం : 2.27 కోట్లు
సీడెడ్ : 33.5 లక్షలు
గుంటూరు : 28.4 లక్షలు
ఉత్తరాంధ్ర : 40.5 లక్షలు
తూర్పు గోదావరి : 17.2 లక్షలు
పశ్చిమ గోదావరి : 17 లక్షలు
కృష్ణ : 27.5 లక్షలు
నెల్లూరు : 11 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ : 4.02 కోట్లు