`హిట్` 2 డేస్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌!


`హిట్` 2 డేస్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌!
`హిట్` 2 డేస్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌!

విశ్వ‌క్‌సేన్ న‌టించిన‌ తాజా చిత్రం `హిట్‌`. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నాని వైఫ్ నిర్మించిన ఈ చిత్రం తొలి షో నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో మంచి ఓపెనింగ్స్‌ని సాధించింది. ఇంటెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాతో విశ్వ‌క్‌సేన్ మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. తొలి టీజ‌ర్ నుంచే ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమా ఊహించిన దానికి మించి ఓపెనింగ్స్‌ని రాబ‌ట్టింది.

దీంతో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. దీనికి ముందు విశ్క్‌సేన్ చేసిన `ఫ‌ల‌క్‌నుమా దాస్‌` విజ‌యం కూడా దీనికి మ‌రింత హెల్ప్ చేసింది. తొలి సినిమాతో పోలిస్తే ఈ చిత్రానికి మ‌రింత వ‌సూళ్లు పెరిగాయి. ఆంధ్రా తెలంగాణ‌లో తొలి రోజు 1.27 కోట్ల షేర్‌ని సాధించింది. అదే ఊపుని రెండ‌వ రోజు కూడా కొన‌సాగించి 1.1 కోట్ల‌ని రాబ‌ట్టింది.  ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో `హిట్‌` సాధించిన వ‌సూళ్ల వివ‌రాలు ఇలా వున్నాయి.

నైజాం : 1.33 కోట్లు

సీడెడ్ : 19.5 కోట్లు

గుంటూరు : 20 ల‌క్ష‌లు

ఉత్త‌రాంధ్ర : 23 ల‌క్ష‌లు

తూర్పుగోదావ‌రి :10 ల‌క్ష‌లు

ప‌శ్చిమ గోదావ‌రి : 11 ల‌క్ష‌లు

కృష్ఱా  : 13 ల‌క్ష‌లు

నెల్లూరు : 7 ల‌క్ష‌లు

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సాధించిన మొత్తం 2 డేస్ షేర్ 2. 36 కోట్లు.