నాని హిట్ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్

Hit movie closing collections report
Hit movie closing collections report

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన రెండో సినిమా హిట్. మొదటి సినిమా అ! కు విమర్శకుల ప్రశంసలు వచ్చిన విషయం తెల్సిందే. రెండో సినిమాగా కొంత రిస్క్ చేసాడు నాని. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో సాగే సినిమాను నిర్మించాడు. కొత్త దర్శకుడు శైలేష్ కొలను చేతిలో దర్శకత్వ బాధ్యతలు పెట్టాడు. అయితే కొత్త దర్శకుడైనా ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు కూర్చుని స్క్రిప్ట్ రాసుకున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా రుహని శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన హిట్ ఫిబ్రవరి 28న విడుదలై డీసెంట్ రివ్యూలు తెచ్చుకుంది. అయితే అన్ సీజన్ లో విడుదల కావడం ఈ చిత్రంపై నెగటివ్ ప్రభావం చూపితే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో థియేటర్లు బంద్ అవ్వడంతో హిట్ ఫుల్ రన్ కు చేరుకుంది.

లిమిటెడ్ బడ్జెట్ లోనే తెరకెక్కించిన హిట్ వరల్డ్ వైడ్ గా 6.87 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది. మంచి సీజన్ లో రిలీజై కరోనా వైరస్ ఎఫెక్ట్ లేకపోతే ఈ చిత్రం మరింత వసూలు చేయగలిగి ఉండేది. ఏదైతేనేం హిట్ మొత్తానికి ఎబోవ్ యావరేజ్ చిత్రమనిపించుకుంది.

ఒకసారి హిట్ ఏరియా టు ఏరియా బ్రేక్ డౌన్ చూస్తే..

నైజాం : Rs 3.05 Cr

సీడెడ్ : Rs 0.49 Cr

వైజాగ్ : Rs 0.66 Cr

ఈస్ట్ : Rs 0.32 Cr

వెస్ట్ : Rs 0.28 Cr

కృష్ణ : Rs 0.47 Cr

గుంటూరు : Rs 0.43 Cr

నెల్లూరు : Rs 0.19 Cr

ఆంధ్ర + తెలంగాణ : Rs 5.89 Cr షేర్

రెస్ట్ ఆఫ్ ఇండియా : Rs 0.26 Cr

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : Rs 0.72 Cr

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : Rs 6.87 Cr షేర్

హిట్ చిత్రానికి సీక్వెల్ తీస్తామని విడుదలకు ముందు ప్రకటించారు కానీ ఇప్పుడు దానిపైన ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.