నటి కాల్చివేత


hollywood actress vanessa marcuse diedబొమ్మ తుపాకీని ఓ నటి పోలీసులపైకి ఎక్కుపెట్టడంతో అది నిజమైన తుపాకీ అనుకున్న పోలీసులు వెంటనే ఆ నటిని కాల్చిచంపారు , అయితే ఆమె చనిపోయాక దగ్గరకు వెళ్లి ఆ తుపాకీ ని పరిశీలిస్తే అప్పుడు కానీ తెలియలేదు జరిగిన ఘోర ప్రమాదం ఆ నటి పట్టుకుంది బొమ్మ తుపాకీ అని కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది ఆ నటి చనిపోయింది . ఈ సంచలన సంఘటన లాస్ ఏంజిల్స్ లో జరిగింది .పోలీస్ కాల్పుల్లో చనిపోయిన నటి వెనెస్సా మార్క్యూజ్ (49).

హాలీవుడ్ లో పలు టెలివిజన్ సిరీస్ లలో నటించిన వెనెస్సా మార్క్యూజ్ లాస్ ఏంజెల్స్ లో అద్దెకు ఉంటోంది . అయితే ఆమె ప్రవర్తన కొంతకాలంగా విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చిన ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసాడు . ఫిర్యాదు అందడంతో వెనెస్సా ఇంటిని తనిఖీ చేయడానికి వచ్చారు పోలీసులు అయితే పోలీసులను చూసిన వెనెస్సా మార్క్యూజ్ తనదగ్గర ఉన్న బొమ్మ తుపాకీ పోలీసుల పైకి ఎక్కుపెట్టడంతో వెంటనే పోలీసులు వెనెస్సా ని కాల్చి చంపారు . అయితే అది బొమ్మ తుపాకీ కావడంతో ఘోర సంఘటన జరిగింది , ఓ నిండు ప్రాణం బలైంది .

English Title: hollywood actress vanessa marcuse died