రానా కోసం హాలీవుడ్‌ టెక్నీషియ‌న్స్‌!

Hollywood And Bollywood Technicians Working For Rana’s Virataparvam
Hollywood And Bollywood Technicians Working For Rana’s Virataparvam

టాలీవుడ్ హంక్ రానా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. `నీదీ నాదీ ఒకే క‌థ‌` ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. న‌క్స‌లిజం నేప‌థ్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌రంగా ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్నఈ మూవీ షూటింగ్ చివ‌రి ఫేజ్‌కు చేరుకుంది. హీరో రానా వ్య‌క్తిగ‌త కార‌ణాల దృష్ట్యా అమెరికా వెళ్ల‌డంతో చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం అవుతూ వ‌చ్చిన ఈ చిత్రం చివ‌రి షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. అభ‌యార‌ణ్యం నేప‌థ్యంలో చిత్రీక‌రించే యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయ‌ట‌. ఇందు కోసం హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ప‌నిచేస్తున్నార‌ట‌. ముఖ్యంగా ఉరి :  ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌కి యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు నేతృత్వం వ‌హించిన హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్ స్టీఫెన్ రీచెర్ ప‌నిచేస్తున్నార‌ట‌.

ఈ స‌న్నివేశాల్లో రానాతో పాటు చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటోంద‌ట‌. ప్రియ‌మ‌ణి, నందితాదాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వాహెబ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి డాని సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. స‌మ్మ‌ర్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. డి.సురేష్‌బాబుతో క‌లిసి సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.