`లైగ‌ర్‌` కోసం హాలీవుడ్ స్టంట్‌మెన్‌!

`లైగ‌ర్‌` కోసం హాలీవుడ్ స్టంట్‌మెన్‌!
`లైగ‌ర్‌` కోసం హాలీవుడ్ స్టంట్‌మెన్‌!

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ భామ అన‌న్య పాండే హీరోయిన్‌‌గా న‌టిస్తోంది. ఈ మూవీ ద్వారా మ‌న రౌడీ హీరో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. క‌ర‌ణ్ జోహార్, అపూర్వ మెహ‌తాతో క‌లిసి ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ముంబైలో పునః ప్రారంభ‌మైంది. తాజాగా ఈ మూవీ కోసం ఓ భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. ఇందు కోసం మాసీవ్ సెట్‌ని కూడా రెడీ చేశారు. ఈ సెట్‌లో భారీ ఎత్తున జ‌రిగే యాక్ష‌న్ ఘ‌ట్టాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ఆండీ లాంగ్‌ని తీసుకున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం మంగ‌ళ‌వారం సాయంత్రం అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఆండీ లాంగ్ హాలీవుడ్ స్టార్ జాకీచాన్ న‌టించిన ప‌లు చిత్రాల‌తో పాటు పలువురు హాలీవుడ్ న‌టుల చిత్రాల‌కు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ చేశారు. ఈ స్టంట్ మాస్ట‌ర్ నేతృత్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పాల్గొన‌గా `లైగ‌ర్‌` కోసం హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన ఏ విష‌యంలోనూ మేక‌ర్స్ రాజీప‌డ‌టం లేదు. ప్ర‌తీదీ హై రేంజ్‌లో వుండేలా ప్లాన్ చేస్తున్నారు. దానికి హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్ ఆండీ లాంగ్ ‌ని ఈ మూవీకి తీసుకోవ‌డ‌మే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.