బిగ్ బాస్ 4: హోస్ట్ ఫిక్స్ అయినట్లే?Big Boss Telugu 4
Big Boss Telugu 4

మొత్తానికి బిగ్ బాస్ 3 సక్సెస్ ఫుల్ గా ఫినిష్ అయ్యింది. ఇంట్రెస్టింగ్ టాస్కులతో కంటెస్టెంట్స్ ఎవరికివారు తమ టాలెంట్ తో మంచి క్రేజ్ అందుకున్నారు. ఫైనల్ గా రాహుల్ టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక షో అలా ముగిసిందో లేదో నెక్స్ట్ సీజన్ పై రూమర్స్ మొదలయ్యాయి. ఎవరు ఊహించని విధంగా హోస్ట్ కాన్సెప్ట్ పై కథనాలు వెలువడుతున్నాయి.

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 4వ సీజన్ కి హోస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. గతంలో నాగార్జున చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి మెగాస్టార్ వ్యాఖ్యాతగా ఉన్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో నాగ్ చేసిన బిగ్ బాస్ పగ్గాలను చేతిలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
దాదాపు మెగాస్టార్ నెక్స్ట్ సీజన్ కి ఫిక్స్ అయినట్లే అని టాక్ వైరల్ అవుతోంది. గ్రాండ్ ఫైనల్ గా మెగాస్టార్ ముఖ్య అతిధిగా వచ్చి ట్రోపిని విజేతకు అందించారు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల్లో ఒక క్లారిటి రావాలంటే నెక్స్ట్ సీజన్ సెట్స్ పైకి వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తనికి నాగార్జున తనదైన స్టార్ డమ్ తో షోకి మంచి బజ్ క్రియేట్ చేశారు. మరి నెక్స్ట్ మెగాస్టార్ ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి తన 152వ సినిమా కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే.