ఇంతకీ పవన్ కళ్యాణ్ కు ఎంతమంది పెళ్ళాలు ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు , ఈ విషయం అందరికీ తెలిసిందే . మొదట వైజాగ్ కి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు , విడాకులు ఇచ్చాడు . ఇక రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు అయ్యాక విభేదాలతో విడాకులు ఇచ్చాడు . ఆ తర్వాత అన్నా లెజ్ నోవా ని పెళ్లి చేసుకున్నాడు ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు . అంటే మొత్తం మూడు పెళ్లిళ్లు అన్నమాట ! అయితే వివాదాస్పద భామ శ్రీరెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని ట్వీట్ చేసింది .

కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు . అప్పట్లో ఇది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ తాజాగా శ్రీ రెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పట్ల ట్వీట్ చేయడంతో సంచలనంగా మారింది . పవన్ కళ్యాణ్ చేసుకుంది మూడు పెళ్లిళ్లు అయితే నాలుగు పెళ్లిళ్లు అనడం ఏంటో ? ఇంతకీ పవన్ చేసుకుంది మూడు పెళ్లిళ్ళా ? నాలుగు పెళ్లిళ్ళా ? లోగుట్టు ఏంటో ? ఆ లోగుట్టు పెరుమాళ్ళకెరుక ?