సాహో బ్లాక్ బస్టరా ? డిజాస్టరా ?


Saaho
Saaho

ఈనెల 30 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల అవుతున్న సాహో చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందా లేక డిజాస్టర్ అవుతుందా ? ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది ఫిలిం నగర్ సర్కిల్లోనే కాదు నలుగురు ఏ చోటా కలిసినా సాహో గురించే మాట్లాడుకుంటున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో భారీ ఎత్తున రూపొందిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రాలు ఎక్కువ శాతం డిజాస్టర్ లు అయ్యాయి.

భారీ అంచనాలను అందుకున్న చిత్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి దాంతో సాహో విజయం పై నీలినీడలు కమ్ముకున్నాయి దానికి తోడు పలు సెంటిమెంట్లు ఈ సినిమాని పట్టి పీడిస్తున్నాయి. దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలు బ్లాక్ బస్టర్ లు కొడతారు కానీ ఆ తర్వాత మాత్రం డిజాస్టర్ లు కొడతారనే సెంటిమెంట్ ఉంది, ఇది కాక రెండో సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకులకు తెలుగులో అంతగా సక్సెస్ అయినవాళ్లు కూడా తక్కువే ! మొదటి సినిమాతో హిట్ కొట్టి రెండో సినిమాతో డిజాస్టర్ లు అందుకున్న వాళ్ళ జాబితా చాలా పెద్దదే తెలుగులో.

ఇక వీటికి తోడు ఇంకా రకరకాల కారణాలు , వాదనలు ఉండనే ఉన్నాయి సాహో పైన దాంతో సాహో పై చర్చ సాగుతూనే ఉంది. ఈ వాదనలు ఎలా ఉన్నప్పటికీ సాహో పై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి భారీ ఓపెనింగ్స్ అయితే రావడం ఖాయం అలాగే మొదటి రోజు రికార్డులు అన్నీ సాహో పేరిట లిఖించడం ఖాయం.