హాట్ భామ తల్లిగా మెప్పిస్తుందా ?


హాట్ భామ తల్లిగా మెప్పిస్తుందా ?
త్రివిక్రమ్, అల్లు అర్జున్ మరియు టాబు

హాట్ భామ టబు అల్లు అర్జున్ తల్లిగా నటించడానికి సిద్ధం అవుతోంది . త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్న చిత్రంలో టబు కీలక పాత్రలో నటించనుంది అందునా అల్లు అర్జున్ కు తల్లిగా అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటుగా సినిమా ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్న అనుమానం నెలకొంది . టబు కి హాట్ ఇమేజ్ ఉంది , ఇప్పటికి కూడా ఏ ఈవెంట్ కైనా హాజరైతే ఎద అందాలను చూపెడుతూ స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతూ ఉంటోంది .

అలాంటి టబు అల్లు అర్జున్ కు తల్లిగా మెప్పిస్తుందా ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది .ఇక దర్శకులు త్రివిక్రమ్ విషయానికి వస్తే సెక్షీ భామలను , ముదురు ఆంటీ లను తన సినిమాలో కీలక పాత్రల్లో పెట్టుకుంటాడు . ఇది అతడి ప్రతీ సినిమాలో కూడా ఉంటుంది . దాంతో రకరకాల కథనాలు వినిపిస్తూనే ఉంటాయి . 47 ఏళ్ల టబు ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు పైగా హైదరాబాదీ కానీ ఉండేది మాత్రం ముంబై లో .