`కేజీఎఫ్‌`హీరో య‌ష్‌కి వున్న కార్లెన్నీ?

`కేజీఎఫ్‌`హీరో య‌ష్‌కి వున్న కార్లెన్నీ?
`కేజీఎఫ్‌`హీరో య‌ష్‌కి వున్న కార్లెన్నీ?

క‌న్న‌డ రాకింగ్ స్టార్ రాఖీ భాయ్ య‌ష్ పేరు `కేజీఎఫ్‌`తో దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఈ మూవీతో ఒక్కసారిగా య‌ష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్ర‌స్తుతం య‌ష్ `కేజీఎఫ్‌`కు కొన‌సాగింపుగా రూపొందుతున్న `కేజీఎఫ్ 2`లో న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇందులో బాలీవుడ్ స్టార్స్ సంజ‌య్‌ద‌త్‌, ర‌వీనా టాండ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా ప్ర‌కాష్‌రాజ్‌, రావు ర‌మేష్ కూడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ ఓ రేంజ్‌లో ఈ మూవీపై అంచ‌నాల్ని సెట్ చేసింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ మూవీ జూలై 16న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇదిలా వుంటే య‌ష్‌కి కార్లంటే అమిత‌మైన ప్రేమ అని అత‌ని కార్ల లిస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం య‌ష్ ద‌గ్గ‌ర ఆడీ 7 క్యూ, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ ఎస్ 350డీ ..జీఎల్ ఎస్ లైన‌ప్‌లో టాప్ మోడ‌ల్ కార్‌తో పాటు ఈఎమ్‌డబ్ల్యూ520డీ వున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం ఈ టాపిక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ, య‌ష్ అభిమానుల్లోనూ ట్రెండ్ అవుతోంది.