అన్నా చెల్లెల్లుగా బాలీవుడ్ క్రేజీ జంట‌?


Hrithik Roshan and Deepika Padukone will play brother and sister
Hrithik Roshan and Deepika Padukone will play brother and sister

`బాహుబ‌లి` సినిమా త‌రువాత బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిలోనూ లార్జ‌ర్‌దెన్ లైఫ్ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. ఈ త‌ర‌హా చిత్రాల‌కు ప్రేక్ష‌కుల్లో క్రేజ్ ఏర్ప‌డ‌టం, మార్కెట్ స్థాయి కూడా పెర‌గ‌డంతో మేక‌ర్స్ ముందుకొస్తున్నారు.  బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ న‌టించిన `దంగ‌ల్‌` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన నితీష్ తివారి త్వ‌ర‌లో మ‌హాభార‌తాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారంటూ గ‌త కొన్నిరోజ‌లుగా ప్రచారం జ‌రుగుతోంది. మ‌ధు మంతెన రామాయ‌ణ‌, మ‌హాభార‌తాల‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇందులో మ‌హాభార‌తాన్ని రెండు భాగాలుగా నిర్మించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన ఆయ‌న ఇందు కోసం న‌టీన‌టుల ఎంపిక‌ను కూడా ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ చిత్రాల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా తెర‌పైకి రానున్న ఈ చిత్రంలో దీపికా ప‌దుకోన్ ద్రౌప‌దిగా న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. హృతిక్ రోష‌న్ కృష్ణుడిగా క‌నిపిస్తార‌ని చెబుతున్నారు. ఇంత‌కు ముందు ఈ పాత్ర‌లో ఆమీర్‌ఖాన్ న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం మాత్రం కృష్ణుడిగా హృతిక్ రోష‌న్ న‌టిస్తార‌ని తెలుస్తోంది.

మ‌హాభార‌తం ద్రౌప‌ది, శ్రీ‌కృష్ణుడి చుట్టూ తిరుగుతుంది కాబ‌ట్టి ఆ కీల‌క పాత్ర‌ల కోసం హృతిక్‌, దీపిక అయితేనే క్రేజ్ వుంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆ కార‌ణంగానే వారిని ఎంపిక చేయ‌బోతున్న‌ట్టు చెబుతున్నారు. అన్నీ స‌వ్యంగా కుదిరితే మ‌హాభార‌తం తొలి భాగాన్ని 2021 దీపావ‌ళి నాటికి మొద‌లుపెట్టే అవ‌కాశాలు వున్నాయ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.