మాజీ భార్యతో ఎంజాయ్ చేస్తున్న హీరోHrithik roshan enjoying with ex wife Sussanne khan 

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసానే ఖాన్ తో ఎంజాయ్ చేస్తున్నాడు .సుసానే ఖాన్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్న తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో 2014 లో విడాకులు తీసుకున్నారు . 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ – సుసాన్నె ఖాన్ పెళ్లి చేసుకున్నారు అయితే పదమూడేళ్ల కాపురంలో ఎక్కువగా గొడవలు జరగడంతో 2014 ప్రారంభంలో విడాకులు తీసుకున్నారు . అప్పట్లో ఈ ఇద్దరూ విడిపోకుండా ఇరు కుటుంబాల సభ్యులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసారు కానీ కుదరలేదు . కట్ చేస్తే కొంతకాలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి తమ ఇద్దరు పిలల్లతో కలిసి విహార యాత్రలు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు .

ఇప్పటికే పలుమార్లు విహార యాత్రలకు , విదేశీ యాత్రలకు వెళ్లొచ్చిన ఈ జంట తాజాగా మరోసారి బీచ్ కెళ్ళారు . అక్కడ తన ఇద్దరు కొడుకులతో హృతిక్ బీచ్ లో ఆడుకుంటున్న సమయంలో మాజీ భార్య ఆ తతంగమంతా వీడియో తీసిందట ! అది హృతిక్ కు బాగా నచ్చింది దాంతో ఆ వీడియో ని , ఫోటో ని పోస్ట్ చేస్తూ ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే నా మాజీ భార్య తీసింది అంటూ ప్రేమని ఒలకబోస్తున్నాడు హృతిక్ రోషన్ . విడాకులు తీసుకొని ఉప్పు నిప్పులా ఉన్న ఈ ఇద్దరూ గత రెండేళ్లుగా పిల్లలతో కలిసి , వాళ్లకు ప్రేమ పంచాలి అనే కాన్సెప్ట్ తో వీళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు .

English Title: Hrithik roshan enjoying with ex wife Sussanne khan