స్టార్ హీరో తండ్రికి క్యాన్సర్


Hrithik roshan father Rakesh roshan suffering with cancer

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి అయిన రాకేష్ రోషన్ కు క్యాన్సర్ సోకిందని స్వయంగా హృతిక్ రోషన్ వెల్లడించాడు .  తన తండ్రికి క్యాన్సర్ అని ఈరోజు ఉదయం తండ్రితో కలిసి దిగిన ఫోటోని  ట్వీట్ చేసాడు హృతిక్ రోషన్ . అయితే ఈరోజు సర్జరీ జరుగుతుందని కూడా ప్రకటించాడు . హృతిక్ ట్వీట్ తో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది . ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు క్యాన్సర్ బారిన పడగా తాజాగా ఆ కోవలోకి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కూడా చేరాడు .

రాకేష్ రోషన్ నటుడు కూడా అప్పట్లో , అయితే ఆ తర్వాత కాలంలో నటన మానేసి కొడుకు కోసం నిర్మాతగా దర్శకుడిగా మారాడు . హృతిక్ రోషన్ తో పలు హిట్ చిత్రాలను నిర్మించి , దర్శకత్వం వహించి స్టార్ హీరోగా నిలబెట్టాడు . హృతిక్ రోషన్ హీరోగా నిలబడ్డాడంటే అందుకు  తండ్రి రాకేష్ రోషన్ కృషి కారణం అనే చెప్పాలి . రాకేష్ కి క్యాన్సర్ అని చెప్పగానే అతడు క్యాన్సర్ మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు హృతిక్ అభిమానులు .

English Title : Hrithik roshan father Rakesh roshan suffering with cancer