విషాదంలో స్టార్ హీరో


Hrithik Roshan's Grand Father Om Prakash
Hrithik Roshan’s Grand Father Om Prakash

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది . హృతిక్ రోషన్ తాత జె . ఓంప్రకాష్ (93) ఈరోజు బుధవారం తుదిశ్వాస విడిచారు . హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన జె . ఓంప్రకాష్ కన్నుమూయడంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి . ఇటీవలే హీరో హృతిక్ రోషన్ తన తాతయ్య ఫోటో ని షేర్ చేసి తనకు ఎన్నో జీవిత పాఠాలు చెప్పాడని తెలియజేసాడు .

93 ఏళ్ల పాటు బ్రతకిన తాతయ్యని తలచుకొని ఉప్పొంగిపోయేవాడు హృతిక్ , అయితే తాతయ్య మరణంతో హృతిక్ రోషన్ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు . తాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కుమిలిపోతున్నాడు . జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని తాతయ్య జీవిత సత్యాలను బోధించాడట హృతిక్ రోషన్ కు . జె . ఓంప్రకాష్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు .