వామ్మో! రికార్డు ధరకు అమ్ముడుపోయిన సైరా రైట్స్


Huge amount for SyeRaa satellite and digital rights
Huge amount for SyeRaa satellite and digital rights

ప్రస్తుతం విడుదలకు దగ్గర్లో ఉన్న క్రేజియస్ట్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి, ఏదొక సంచలనంతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంటూ, మరోవైపు ప్రమోషనల్ కార్యక్రమాలలో తలమునకలై ఉన్న సైరా గురించిన ఒక వార్త ఈ చిత్రంపై ఉన్న అంచనాలను చెప్పకనే చెప్పింది. సైరా డిజిటల్, సాటిలైట్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయింది.

ప్రముఖ ఛానల్ జీ, అన్ని భాషలకు కలిపి డిజిటల్, సాటిలైట్ రైట్స్ కింద 125 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కనుక నిజమైతే నిర్మాత రామ్ చరణ్ పంట పండినట్లే. సైరా నరసింహారెడ్డి మొత్తం ఐదు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెల్సిందే. చిరంజీవి చరిత్ర మరిచిపోయిన పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషిస్తున్న సంగతి తెల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలకు షెడ్యూల్ అయింది.