ఇన్నాళ్లకు బుద్దొచ్చింది


huge budjet movies teach a lession

ఇన్నాళ్ళుగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ అవి ప్లాప్ అవుతున్నప్పటికీ పట్టించుకోకుండా మళ్ళీ మళ్లీ అదే తప్పులు చేస్తూ ఆర్ధికంగా చితికిపోయేసరికి అప్పుడు కానీ బుద్ది రాలేదు దాంతో భారీ సినిమాలు కాదు తీయాల్సింది బడ్జెట్ సినిమాలు మాత్రమే అని తెలుసుకున్నాడట కానీ అప్పటికే ఆలస్యం అయిపొయింది మరి ఇప్పుడు చేసే సినిమాలతోనైనా జాగ్రత్త పడతాడా ? మళ్ళీ ఆర్ధికంగా కోలుకుంటాడా చూడాలి .

ఇంతకీ ఇదంతా చెప్పేది ఎవరి గురించో అర్ధం అయ్యిందా ? బెల్లంకొండ సురేష్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ల గురించి . తన కొడుకుని స్టార్ ని చేయాలనీ పరితపించారు బెల్లంకొండ అందుకే ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో నాలుగు సినిమాలు చేయించాడు . అల్లుడు శీను కాస్త ఫరవాలేదు కానీ మిగతా చిత్రాలు స్పీడున్నోడు , జయ జానకి నాయక , సాక్ష్యం చిత్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి . భారీ బడ్జెట్ వెచ్చించి తీస్తే అవి డిజాస్టర్ లై కూర్చున్నాయి దాంతో ఇప్పటికి తెలిసింది భారీ సినిమాలు కాదు బడ్జెట్ సినిమాలు అని . ఇతరులేమో చిన్న చిన్న బడ్జెట్ లో సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకుంటుంటే ఇతడేమో భారీ సినిమాలు తీసి దెబ్బతిన్నాడు .

English Title: huge budget movies teach a lesson