నేలవిడిచి సాము చేస్తున్న గోపీచంద్


Huge budjet for Gopichand' s 26 th film
Gopichand

హీరో గోపీచంద్ కు గతకొంత కాలంగా తీవ్రమైన దెబ్బలు తగులుతూనే ఉన్నాయి . భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి అయినప్పటికీ తన మార్కెట్ పరిధి దాటి మరీ ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు బొక్కా బోర్లా పడుతూనే ఉన్నారు . నిర్మాతలు బాగా నష్టాలు వచ్చి లబో దిబో మంటూనే ఉన్నారు .

తాజాగా గోపీచంద్ మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు . ఇక ఈ సినిమాకు ఏకంగా 30 కోట్ల బడ్జెట్ చెబుతున్నారు . ఈ సినిమా ఇటీవలే  ప్రారంభమైంది కూడా . గోపీచంద్ సినిమాలు 15 నుండి 20 కోట్ల షేర్ రాబట్టడమే గగనం అవుతున్న ఈ రోజుల్లో 30 కోట్ల షేర్ అంటే మాటలా ? అయినా ధైర్యం చేసి మరీ తీస్తున్నారు . దీంతో హిట్ కొట్టినా కుదరదు బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే మరి గోపీచంద్ వల్ల అవుతుందా ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది . తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తుండగా ఈ చిత్రం గోపీచంద్ కు 26 వ సినిమా కావడం విశేషం .

English Title: Huge budjet for Gopichand’ s 26 th film