140 కోట్ల బిజినెస్ చేస్తున్న మహర్షి


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బిజినెస్ పరంగా దూసుకుపోతోంది . ఓవరాల్ గా 140 కోట్ల బిజినెస్ చేసేలా కనిపిస్తోంది . ఇప్పటికే ఓవర్ సీస్ , శాటిలైట్ , హిందీ డబ్బింగ్ , డిజిటల్ రైట్స్ , సీడెడ్ హక్కుల రూపంలో 80 కోట్లకు పైగా బిజినెస్ చేసింది . ఇక మిగిలింది నైజాం , ఆంధ్రా , కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా . నైజాం ఎలాగూ దిల్ రాజు చేతిలోనే ఉంటుంది దాంతో మిగతా ఏరియాలు అమ్మనున్నారు .

మిగిలిన ఏరియాల అమ్మకాలతో మహర్షి బిజినెస్ 140 కోట్లకు చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . అయితే ఈ మహర్షి చిత్రానికి ముగ్గురు నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు కావడం వల్ల పెద్దగా ఎవరికీ లాభాలు రావు . పెట్టిన పెట్టుబడి అయితే ఇప్పుడే వస్తోంది . ఇక సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు ఏమైనా లాభాలు రావొచ్చు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించింది . ఇక ఈ మహర్షి చిత్రాన్ని మే 9 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .