మెగా హీరో సినిమా విడుదలకు ముందే లాభాలు



మెగా హీరో సినిమా విడుదలకు ముందే లాభాలు
మెగా హీరో సినిమా విడుదలకు ముందే లాభాలు

సినీ ప్రపంచంలో ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా టర్న్ అవుతుందో ఎవరం చెప్పలేం. ఈరోజుతో జీరో అనుకున్నవాడు కాస్తా రేపటితో హీరో అయిపోగలడు. దానికి రివర్స్ కూడా జరగొచ్చు. ఏదైనా హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ లక్ మీద ఆధారపడి ఉంటుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషయానికే వస్తే మొదట్లో ప్రామిసింగ్ గా కనిపించిన ఈ హీరో వరసగా ఆరు ప్లాపులు తిన్నాడు. మార్కెట్ దాదాపు కోల్పోయాడు. మిడ్ రేంజ్ లో టాప్ స్థాయికి ఎదుగుతాడు అనుకున్న వాడు కాస్తా తన ఉనికిని చాటుకునే పరిస్థితికి చేరుకున్నాడు.

అయితే ఎక్కడ తప్పు జరుగుతుందో తేజ్ త్వరగానే తెలుసుకున్నాడు. పూర్తిగా కెరీర్ డౌన్ అవ్వకముందే తేరుకున్నాడు. కథల ఎంపికలో కూడా కొన్ని మార్పులు చేసుకున్నాడు. పేరులో ధరమ్ త్యాగం చేసేసాడు. కారణమేదైనా కానీ తన కెరీర్ ఇప్పుడు మరో యూ టర్న్ తీసుకుంది. గతేడాది విడుదలైన రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్స్ ను సాధించాయి. ప్రతిరోజూ పండగే చిత్రంతో 35 కోట్ల షేర్ మార్క్ ను కూడా టచ్ చేసాడు తేజ్.

ఈ నేపథ్యంలో తన తాజా చిత్రానికి బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ మాములుగా లేదు. తేజ్ తాజాగా చేస్తున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మే 1న విడుదల చేద్దామనుకుంటున్నారు. దర్శకుడేమో కొత్తవాడు. అయినా కూడా ఈ సినిమాకు బెస్ట్ డీల్స్ వస్తున్నాయట. ఇటీవలే నాన్ థియేట్రికల్ డీల్స్ ను నిర్మాత క్లోజ్ చేసినట్లు తెలిసింది. దాదాపు 10 కోట్లకు ఈ రేటు పలికిందిట.

సినిమా బడ్జెట్ 20 కోట్ల లోపే ఉంటుందని, రిలీజ్ సమయానికి నిర్మాత టేబుల్ ప్రాఫిట్స్ అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. సినిమా కూడా బాగా వస్తోందని, దీంతో తేజ్ హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేస్తాడని చెబుతున్నారు. చూస్తుంటే తేజ్ ను ఇప్పట్లో ఎవరూ ఆపలేరేమో.