మహానటి శాటిలైట్స్ రైట్స్ కి ఫుల్ డిమాండ్


huge demand for mahanati satellite rightsమహానటి చిత్రం నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆ చిత్ర శాటిలైట్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది . మహానటి శాటిలైట్ హక్కుల కోసం జెమిని టివి తో పాటుగా జీ తెలుగు చానల్ వాళ్ళు కూడా పోటీ పడ్డారు అయితే అశ్వనీదత్ కు సదరు చానల్ వాళ్ళు ఇస్తున్న ఆఫర్ నచ్చకపోవడంతో సినిమా విడుదలకు ముందు అమ్మలేకపోయాడు కట్ చేస్తే సినిమా ఇప్పుడు సూపర్ హిట్ అవుతుండటంతో శాటిలైట్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడింది .

ఇక ఇప్పుడు జీ తెలుగు ఛానల్ అలాగే జెమిని టివి లతో పాటుగా రంగంలోకి స్టార్ మా కూడా చేరింది . మహానటి అద్భుత దృశ్య కావ్యం అని దాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు సదరు ఛానల్ వాళ్ళు . దాంతో అశ్వనీదత్ మంచి రేటు ఎవరు ఇస్తే వాళ్లకు సినిమా ని అమ్మాలని చూస్తున్నాడు . మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ అద్భుత నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు . మళ్ళీ ఇన్నాళ్లకు వైజయంతి సంస్థ కు ఓ బ్లాక్ బస్టర్ వచ్చింది .