శర్వానంద్ డీల్ 12 కోట్లకు

హీరో శర్వానంద్ కు బాగానే డిమాండ్ పెరిగింది . తాజాగా ఈ హీరో నటించిన పడిపడి లేచే మనసు చిత్రానికి భారీ డీల్ కుదిరింది . డిసెంబర్ 21 న విడుదల కానున్న ఈ చిత్ర హిందీ డబ్బింగ్ , డిజిటల్ రైట్స్ , తెలుగు శాటిలైట్ హక్కులు అన్నీ కలిపి 12 కోట్లకు బేరం కుదిరినట్లు తెలుస్తోంది . శర్వానంద్ సరసన సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమా కోసం ఇటీవలే రీ షూట్ కూడా చేసారు . కొన్ని సన్నివేశాలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న దర్శకుడు మళ్ళీ సాయి పల్లవి ని రిక్వెస్ట్ చేసి రీ షూట్ చేసారు .

శర్వానంద్ గతకొంత కాలంగా విభిన్న కథా చిత్రాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాడు దాంతో అతడి మార్కెట్ కూడా పెరిగింది . ఇప్పుడున్న యంగ్ హీరోలలో శర్వా కి విపరీతమైన క్రేజ్ వచ్చింది . దాంతో అతడి సినిమాలకు డిమాండ్ ఏర్పడింది . పడిపడి లేచే మనసు చిత్రానికి రిలీజ్ కి ముందే లాభాలు వస్తున్నాయి . ఇక ఈ సినిమాని కొన్న బయ్యర్లు లాభాలు పొందాలంటే సినిమా హిట్ కావాల్సిందే . డిసెంబర్ 21 న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Huge demand for sharwanand’s padipadileche manasu