డియర్ కామ్రేడ్ టికెట్ల కోసం కొట్లాట


Dear Comrade
Dear Comrade

డియర్ కామ్రేడ్ టికెట్ల కోసం కొట్లాట మొదలయ్యింది , ఈ కొట్లాట ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కాదు సుమా ! అమెరికాలో !!. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికీ డియర్ కామ్రేడ్ చిత్రానికి అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది దాంతో టికెట్లు దొరకడం లేదు . క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో టికెట్ల కోసం పెద్ద యుద్ధమే జరుగుతోందట !

ఓవర్ సీస్ లో ఈరోజు సాయంత్రం తర్వాత షోలు పడనున్నాయి దాంతో డియర్ కామ్రేడ్ టికెట్ల కోసం కొట్లాట మొదలయ్యింది . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోల తోనే 1 మిలియన్ డాలర్ల ని కొట్టేలాగ కనబడుతోంది . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండగా ఓవర్ సీస్ లో మాత్రం కాస్త ముందుగానే షోలు పడనున్నాయి .