జెర్సీ రీమేక్ కోసం తీవ్రమైన పోటీ


నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఇతర బాషలలో రీమేక్ చేయడానికి పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు . తమిళ , మలయాళ , కన్నడ , హిందీ బాషలలో రీమేక్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీ ఈనెల 19 న తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే .

నాని నటనకు జేజేలు పలుకుతున్నారు ప్రేక్షకులు . అలాగే శ్రద్దా శ్రీనాథ్ నటనకు కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు . నాని – శ్రద్దా శ్రీనాథ్ ల నటన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభ వెరసి జెర్సీ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ త్వరలోనే ఇతర బాషలలో రీమేక్ కానుంది . పలువురు పోటీ పడటంతో జెర్సీ రీమేక్ హక్కుల కోసం బాగానే గిట్టుబాటు అయ్యేలా ఉంది .