ఎన్టీఆర్ బయోపిక్ కు కళ్ళు చెదిరే ఆఫర్


huge demond for ntr biopicనందమూరి బాలకృష్ణఎన్టీఆర్ ” బయోపిక్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే . క్రిష్ దర్శకుడిగా యాడ్ అవడంతో ఎన్టీఆర్ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది . దానికి తోడు బాలీవుడ్ భామ విద్యాబాలన్ లాంటి వాళ్ళు కూడా తోడవ్వడంతో తాజాగా రెండు పెద్ద సంస్థలు ఈ సినిమాని కొనుక్కోవడానికి ముందుకు వచ్చాయట ! రెండు పెద్ద సంస్థలు కావడంతో పోటీపడి రేటు కూడా పెంచుతున్నారు . ఎన్టీఆర్ కోసం పోటీపడుతున్న అగ్ర సంస్థలు ఏంటో తెలుసా ……..ఒకటి రిలయన్స్ కాగా రెండోది సోనీ సంస్థ . ఇక వీళ్ళు ఎంత ఆఫర్ ఇచ్చారో తెలుసా ……. 80 కోట్లు .

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళ్ , హిందీ బాషలలో కూడా రిలీజ్ చేయడానికి 80 కోట్ల ఆఫర్ ఇచ్చారట ! అయితే ఈ సినిమా కోసం బాలయ్య కేటాయించిన బడ్జెట్ 50 కోట్లు మాత్రమే ! యాభై కోట్ల బడ్జెట్ లోనే కంప్లీట్ చేయాలనీ డిసైడ్ అయ్యారట అంటే సినిమా ఇంకా కంప్లీట్ కాకముందే దాదాపు 30 కోట్ల లాభం అన్నమాట ! ఒకవేళ మేకింగ్ లో ఖర్చు పెరిగినా మరో అయిదు , పది పెరగొచ్చు ఆమేరకు పోటీ పడుతున్న సంస్థ లు కూడా రేటు పెంచినా ఆశ్చర్యం లేదు . ఇవి థియేట్రి కల్ రైట్స్ మాత్రమే ….. ఇవి కాకుండా డిజిటల్ రైట్స్ , శాటిలైట్ , ఓవర్ సీస్ రైట్స్ ఎలాగూ ఉంటాయి దాంతో మొత్తం కలిపితే వంద కోట్ల పై మాటే బిజినెస్ ! అంతటి బిజినెస్ ఎన్టీఆర్ చేస్తే బాలయ్య చరిత్ర సృష్టించినట్లే ! ఎన్టీఆర్ బయోపిక్ ని 2019 సంక్రాంతి కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: huge demond for ntr biopic